చైనా మరో ముందడుగు | China's Yaogan-28 remote sensing satellite was sent into space | Sakshi
Sakshi News home page

చైనా మరో ముందడుగు

Nov 9 2015 8:18 AM | Updated on Sep 3 2017 12:17 PM

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. యోగాన్-28 అనే రిమోట్ సెన్సింగ్తో పనిచేసే ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.

బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. యోగాన్-28 అనే రిమోట్ సెన్సింగ్తో పనిచేసే ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. షాంగ్జి ప్రావిన్స్లోని తైయువాన్ అనే ప్రాంతం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఆదివారం ప్రయోగించినట్లు చైనా అధికారులు వెల్లడించారు.

ఈ ఉపగ్రహం ప్రయోగాలు చేసేందుకు, భూముల సర్వేలకు, పంటలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు, విపత్తులను ముందుగానే గుర్తించే దాని నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగించనున్నారు. యోగాన్-28ను లాంగ్ మార్చ్-4బీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా ఇది చైనాకు 217వ ప్రయోగం. చైనా తొలి యోగాన్ ఉపగ్రహాన్ని 2006లో నింగిలోకి పంపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement