అమెరికా పౌరులకు చైనా వార్నింగ్‌!

China Warns To Put Visa Restricttions On Americans Over Hongkong Issue  - Sakshi

బీజింగ్‌: వివాదాస్పద నేషనల్‌ సెక్యూరిటి బిల్లుకు బీజింగ్‌ నుంచి అనుమతి లభిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ బిల్లుకు  వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లలో అమెరికా పౌరులు పాల్గొన్నా లేదా  ఇలాంటి వాటికి మద్దతు తెలిపిన వారి వీసాల మీద నిబంధనలు విధిస్తామని చైనా సోమవారం హెచ్చరించింది. (హాంకాంగ్‌ ఆందోళనలు తీవ్రతరం)

ఈ విషయం పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి   జాహు లిజ్జాన్‌ మాట్లాడుతూ, హాంకాంగ్‌ నేషనల్‌ సెక్యూరిటీ బిల్లును అడ్డుకునే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చిరించారు. అమెరికా పౌరులు చేసే పనులకు వ్యతిరేకంగా చైనా వీసా మీద ఆంక్షలు విధించాలనుకుంటుందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక విషయాలలో కలుగజేసుకుంటున్నారనే అభియోగంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొంత మంది చైనా అధికారులపై శుక్రవారం వీసా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (హాంగ్‌కాగుతోంది..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top