ఎవరెస్ట్‌ ఎత్తుపై చైనా అభ్యంతరం

China Remeasure Exact Height Mount Everest - Sakshi

ప్రచారంలో ఉన్న దాని కంటే 4 మీటర్లు తక్కువ: చైనా

బీజింగ్‌: ప్రంపచంలోనే అ‍త్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ హైట్‌పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్‌ ప్రభుత్వం ఎవరెస్ట్‌ ఎత్తును ఎక్కువ చెప్తుందని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో పర్వతం హైట్‌ను ఖచ్చితంగా కొలవడం కోసం చైనా ఒక సర్వే బృందాన్ని‌ బుధవారం ఎవరెస్ట్‌ మీదకు పంపింది. ఆరు దశలుగా పర్వతం హైట్‌ను కొలిచిన చైనా బృందం.. నేపాల్‌ ప్రభుత్వం చెబుతున్న దాని కంటే పర్వతం‌ ఎత్తు 4 మీటర్లు తక్కువ ఉందని తేల్చింది. ప్రస్తుతం ఎవరెస్ట్‌ హైట్‌ 8844. 43 మీటర్లు అని చైనా సర్వే బృందం తెలిపింది. ఇప్పటి వరకు నేపాల్‌​ ప్రభుత్వం ఎవరెస్ట్‌ ఎత్తును 8,848 మీటర్లుగా చెప్తున్న సంగతి తెలిసిందే.

టిబెటన్ భాషలో ఎవరెస్ట్ పర్వతాన్ని చోమో లుంగ్మా పర్వతం అంటారు. ‘ఈ పర్వతం మీద సంభవించే  మార్పులు ప్రపంచ భూగర్భ శాస్త్రం, జీవావరణ శాస్త్రం అధ్యయనాలకు కీలకమైనవి. ఇది ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’ అని చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఇంజనీర్ చెన్ గ్యాంగ్ అన్నారు. చొమోలుంగ్మా పర్వతం ఎత్తును ఖచ్చితంగా కొలవడం వల్ల హిమాలయాలు, కింగ్హై-టిబెట్ పీఠభూమిలో సంభవించే మార్పులను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ వాతావరణ భౌతిక శాస్త్రవేత్త గావో డెంగి చెప్పారు.(మ్యాపుల వివాదం.. నేపాల్‌ ప్రధానికి షరతులు!)

అంతేకాక చైనా టెక్ సంస్థ హువావే, చైనా మొబైల్‌తో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5 జీ స్టేషన్లను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే గనక సాధ్యమైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన 5 జీ బేస్‌ స్టేషన్లుగా ఇవి నిలుస్తాయని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా హువావే ప్రాజెక్ట్ మేనేజర్‌ జాంగ్‌ బో మాటట్లాడుతూ.. ‘ఎవరెస్ట్‌పై 6,500 మీటర్ల ఎత్తు.. అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడే హువావే 5 జీ స్టేషన్‌ను నిర్మించాలని భావిస్తుంది. అయితే సిగ్నల్ 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం వరకు విస్తరించగలదా, లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం సఫలం అయయ్యేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top