పేక ముక్కల్ని కత్తుల్లా.. | China Boy Use Playing Cards Like A Sharp Blades | Sakshi
Sakshi News home page

సినిమా చూసి స్ఫూర్తి పొందాడు 

Sep 7 2019 12:24 PM | Updated on Sep 7 2019 12:49 PM

China Boy Use Playing Cards Like A Sharp Blades - Sakshi

చేతిలో పేక ముక్కలు ఉంటే ఏం చేస్తాం?.. ఓ ఒకర్నిద్దర్ని తోడు చేసుకుని...

బీజింగ్‌ : చేతిలో పేక ముక్కలు ఉంటే ఏం చేస్తాం?.. ఓ ఒకర్నిద్దర్ని తోడు చేసుకుని పేకాట ఆడుతాం. కానీ, చైనాకు చెందిన ఆ అబ్బాయి మాత్రం వాటితో తన ఎదుట ఉన్న వస్తువులను చీల్చి చండాడుతాడు. పేక ముక్కల్ని కత్తుల్లా వాటిలోకి దింపేస్తాడు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెన్‌ఝౌకు చెందిన వాంగ్‌ కాయ్‌ అనే 11 ఏళ్ల కుర్రాడు ‘‘ఫ్రమ్‌ వేగాస్‌ టు మకావ్‌’’ అనే సినిమా చూసి స్ఫూర్తి పొందాడు. అందులోలా పేక ముక్కలతో విన్యాసాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ప్రతి నిత్యం అభ్యాసం చేసి అరుదైన నైపుణ్యాన్ని సంపాదించాడు.

పేక ముక్కల్ని కత్తుల్లా ఎదుట ఉన్న వస్తువుల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తున్నాడు. పుచ్చకాయ, యాపిల్‌, దోసకాయ వంటి వాటిలోనే కాకుండా చెక్క పలకలోకి, కోక్‌ టిన్నుల్లోకి సైతం వాటిని దింపేస్తున్నాడు. వాంగ్‌ నైపుణ్యాన్ని చిత్రీకరిస్తూ తీసిన వీడియోలు గత కొద్దిరోజులుగా సామాజిక  మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement