చైనాలో వ్యాక్సిన్‌కి రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

China approves third coronavirus vaccine for clinical trials - Sakshi

బీజింగ్‌: చైనాలో మూడో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ని రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించినట్టు ఆ దేశం ప్రకటించింది. చైనా సైన్యానికి చెందిన సంస్థ అభివృద్ధి పరిచిన వ్యాక్సిన్‌ సహా ఇప్పటి వరకు చైనా కరోనా వైరస్‌పై మూడు వ్యాక్సిన్‌లను క్లినికల్‌ ట్రయల్స్‌కు ఆమోదించింది. చైనా నేషనల్‌ ఫార్మా స్యూటికల్‌ గ్రూప్‌(సినోఫామ్‌) అధీనంలో పనిచేసే వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయొలాజికల్‌ ప్రొడక్ట్స్‌ ‘ఇనాక్టివేటెడ్‌’వ్యాక్సిన్‌ని అభివృద్ధిపరిచింది. అలాగే వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(డబ్లు్యఐవి) సైతం క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి కూడా పంపిస్తున్నామనీ, అది పూర్తివడానికీ, ఎంత సురక్షితమైందో, సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి  ఏడాది పడుతుందని సినోఫామ్‌ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top