పాపం... కుక్క చెవిలో ట్రంప్‌ ముఖం | Chief's Ill Ear Look Like Trump face | Sakshi
Sakshi News home page

కుక్క చెవిలో ట్రంప్‌ ముఖం

Nov 7 2017 3:43 PM | Updated on Sep 29 2018 4:26 PM

Chief's Ill Ear Look Like Trump face - Sakshi

వాషింగ్టన్‌ : ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో.. పక్కన ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఫోటోకు దగ్గరి పోలికలే కనిపిస్తున్నాయి కదా. అందుకే అమెరికా అధ్యక్షుడి పేరిట ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అచ్చం ట్రంప్‌ ముఖాన్ని పోలి ఉన్న ఇదేంటో తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ఆ సస్పెన్స్ కు తెరదించుతు అదో కుక్క చెవి అంటూ స్పష్టత ఇచ్చారు దాని యజమాని. 

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టినెసైడ్‌ ప్రాంతానికి చెందిన జాడె రాబిన్సన్‌ అనే మహిళ పెంపుడు కుక్క చీఫ్‌. జాగిలంగా కూడా పనిచేసే చీఫ్‌ చెవికి కొంత కాలం క్రితం ఇన్‌ఫెక్షన్‌ సోకింది. ఆపై వైద్యం తీసుకెళ్తే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె తన శక్తిమేర దానికి వైద్యం అందిస్తూ వచ్చారు. అయితే నానాటికీ చీఫ్‌ చెవి కుచించుకుపోయి దానికి విపరీతమైన నొప్పిని కలిగించటం ప్రారంభించసాగింది. ఇదిలా ఉండగా ఓ రోజు దాని చెవిని నిశితంగా పరిశీలించిన జాడె స్నేహితురాలు అది ట్రంప్‌ ఫేస్‌ను పోలి ఉండటాన్ని గమనించారు. 

వెంటనే ఆ విషయాన్ని జాడెకు తెలియజేసిందంట. ముందు జాడెకు అలా అనిపించకపోయినా.. చాలా సార్లు గమనించి అది ట్రంప్‌ ముఖాన్ని పోలి ఉందని నిర్ధారించుకున్నారు. దీంతో వెంటనే చీఫ్ చెవిని ఫోటోగా పెట్టిన ఓ పేజీని క్రియేట్‌ చేసి విరాళాలు కోసం అభ్యర్థనలు చేయటం ప్రారంభించింది. ట్రంప్‌ వ్యతిరేకులు ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు రాగా, ఆయన మద్దతుదారులు మాత్రం జాడె చేసిన పనిపై మండిపడుతున్నారు. ఇప్పటిదాకా 40 పౌండ్ల దాకా వసూలు చేసిన ఆమె, చీఫ్ వైద్యం కోసం 430 పౌండ్లు అవసరమని చెబుతున్నారు.  ఏది ఏమైనా ట్రంప్‌ ముఖం పేరిట ఓ మంచి పని జరిగితే అంతకంటే ఏ కావాలి చెప్పండి. 

Advertisement
 
Advertisement
Advertisement