ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల | Charlie Hebdo Attack: French Police Release Pictures of Suspect Brothers | Sakshi
Sakshi News home page

ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల

Jan 8 2015 8:40 AM | Updated on Sep 2 2017 7:24 PM

ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల

ఇద్దరు అనుమానితుల ఫోటోలు విడుదల

ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై ముష్కరులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇద్దరు వాంటెడ్ పర్సన్స్ కు ఆ దేశ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.

పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై ముష్కరులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇద్దరు అనుమానితులకు ఆ దేశ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. గతంలో పలు దాడులతో  ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34),  సయ్యద్ కౌచీ(34) లకు  గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి వారి ఫోటోలను తాజాగా విడుదల చేశారు. ప్రజా భద్రతలో భాగంగానే వారి ఫోటోలను విడుదల చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement