చైర్ లో కూర్చుని గాల్లో చక్కర్లు! | Canadian man arrested for flying in chair tied to balloons | Sakshi
Sakshi News home page

చైర్ లో కూర్చుని గాల్లో చక్కర్లు!

Jul 7 2015 5:47 PM | Updated on Aug 27 2019 4:33 PM

చైర్ లో కూర్చుని గాల్లో చక్కర్లు! - Sakshi

చైర్ లో కూర్చుని గాల్లో చక్కర్లు!

మనం రకరకాల విన్యాసాలను రోజూ చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి గాల్లో వినూత్న తరహాలో చక్కర్లు కొట్టి జనాన్ని ఆకర్షించాలనుకున్నాడు.

టొరొంటో:  మనం రకరకాల విన్యాసాలను రోజూ చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి  గాల్లో వినూత్న తరహాలో చక్కర్లు కొట్టి జనాన్ని ఆకర్షించాలనుకున్నాడు. కెనడాకు చెందిన డానియల్ బోరియా అనే అతను ఓ వ్యాపార ప్రకటన చేసే క్రమంలో గాల్లో విహరించే సాహస కార్యానికి పూనుకున్నాడు. ఆ క్రమంలో వందకు పైగా హీలియం బెలూన్లు తీసుకుని ప్యారాచూట్ మాదిరిగా తయారు చేశాడు.

 

మరి వాటికి ఒక ఫోల్డింగ్ చైర్ ను అనుసంధానం చేసుకున్నాడు. ఇంకేముందు అందుకు జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని గాల్లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాడు.  కొన్ని గంటలు పాటు తనపనిని తాను పూర్తి చేసి దిగ్విజయంగా కిందికి దిగిపోయాడు. ఇటువంటి సాహసకృత్యాలు అత్యంత ప్రమాదకరం కావడంతో అతన్ని ఆదివారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు పాటు జైల్లో ఉంచి విడిచిపెట్టారు. ఇంతకీ ఆ సాహసం విలువ ఎంతో చెప్పలేదు కదూ ఇరవై వేల డాలర్లట. అయితే దీనిపై బొరియా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దీనికోసం ఎప్పట్నించో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎట్టకేలకు ఆ పనిని పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement