కరోనా.. ప్రజలకు వందనం చేస్తుండగా ప్రమాదం

Canada Air Force Plane Crashes During Coronavirus Tribute - Sakshi

టోరంటో : కెనడా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం ఆదివారం కుప్పకూలింది. కరోనా వైరస్‌పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రజలకు అ తెలిపే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనాపై పోరాటంలో కెనడా ప్రజల సహాకారాన్ని అభినందించడానికి బ్రిటీష్ కొలంబియాపై స్నో బర్డ్స్ టీమ్ కు చెందిన ఏరోబెటిక్స్ టీమ్ విన్యాసాలు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా కామ్లూప్స్ విమానాశ్రయం నుంచి రెండు విమానాలు టేకాఫ్ అయ్యాయి. అయితే టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే, అందులో ఒక విమానం అదుపుతప్పి ఓ ఇంటిముందు కుప్పకూలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక  ప్రజలు ఆందోళనకు గరయ్యారు. ఏం జరుగుతుంతో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.(చదవండి : వదల బొమ్మాళీ..!)  

ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రావిన్స్‌ ఆరోగ్య శాఖ మంత్రి అడ్రియన్‌ డిక్స్ మాట్లాడుతూ‌.. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా, అతన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ‘విమానం అదుపు తప్పిన సమయంలో అది రెండు అంతస్థుల ఎత్తులో ఉంది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ ప్యారాచూట్‌ సాయంతో ఓ ఇంటి పై కప్పుపై దిగాడు. ఈ సమయంలో అతని మెడకు, వీపు వెనకాల గాయాలు అయ్యాయి’ అని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం చాలా బాధకరమని రాయల్‌ కెనడియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ట్వీట్‌ చేసింది. (చదవండి : మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top