వైమానిక దాడులు ప్రారంభించిన బ్రిటన్ | britton carried out air strikes on IS in Syria | Sakshi
Sakshi News home page

వైమానిక దాడులు ప్రారంభించిన బ్రిటన్

Dec 3 2015 10:28 AM | Updated on Sep 3 2017 1:26 PM

వైమానిక దాడులు ప్రారంభించిన బ్రిటన్

వైమానిక దాడులు ప్రారంభించిన బ్రిటన్

సిరియాలోని ఐఎస్ స్థావరాలపై దాడులకు మరో అగ్రరాజ్యం సిద్ధమైంది.

లండన్: సిరియాలోని ఐఎస్ స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియాలో దాడులు జరపడానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే ఐఎస్ స్థావరలపై రాయల్ బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడటం విశేషం. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన పలు స్థావరాలు ద్వంసమైనట్లు తెలుస్తోంది. మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించాలని కామెరాన్ ఇచ్చిన పిలుపు.. పార్లమెంట్లో 397-223 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

గతంలో కూడా సిరియాలోని అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు నిర్వహించాలని కామెరూన్ భావించినా 2013లో అతని వాదన  పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. అయితే ఇటీవల పారిస్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులను తుదముట్టించాలనే ఆలోచనకు బ్రిటన్ పార్లమెంట్ అంగీకారం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement