‘కరోనా మరణాల సంఖ్య తారుమారు’

Brazil President Jair Bolsonaro Questioned On Coronavirus Deaths - Sakshi

బ్రెసిలియ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ల ఆరోపణలపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక రాజధాని సావోపాలోలోని కరోనా వైరస్‌ మరణాల సంఖ్యను తారుమారు చేశారని మండిపడ్డారు. అంతేగాక అక్కడ మరణాల సంఖ్యపై తనకు సందేహం ఉందని కూడా ఆరోపించారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రజా వైద్య ఆరోగ్య సంస్థ సూచనల మేరకు బ్రెజిల్‌లోని 26 రాష్ట్రాల గవర్నర్‌లు అనవసరమైన వాణిజ్య కార్యకలాపాల సేవలను నిషేధించారు. దీంతో ఆ దేశ ఆధ్యక్షుడు బోల్సోనారో దీనిపై ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘దేశ ఆర్థిక రాజధాని అయిన సావోపాలోలో మరణించే వారిని మనం కాపాడలేనప్పుడు.. వారిని చనిపోనివ్వండి. ట్రాఫిక్‌ వల్ల కారు ప్రమాదం జరిగితే ఏకంగా కార్ల తయారి కర్మాగారాన్ని మూసి వేయలేం కదా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సావోపాలోలో మరణాల సంఖ్య అధికంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ వల్ల శుక్రవారం నాటికి అక్కడ 1,223 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 68 మంది మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అక్కడి పరిస్థితుల తీవ్రతను మనం గమనించాలి. కానీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే సమయం ఇది కాదు’ అంటూ మండిపడ్డారు. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..)

కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు...
ఇతర దేశస్థులు తమ దేశంలో ప్రవేశించకుండా విమానాశ్రయ సేవలను బ్రెజిల్‌ న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిలిపివేసింది. దీనిని సోమవారం నుంచి అమలు చేయలనున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాలల్లో కూడా ఈ చర్యలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం కూడా బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ఇతర దేశాలలో 'క్వాంటిటేటివ్ సడలింపు' విధానాలకు అనుగుణంగా అత్యవసర బాండ్-కొనుగోలకు అధికారాలు పిలుపునిచ్చారు. అదే సమయంలో పేరోల్‌తో  చిన్న కంపెనీలకు సహాయం చేయడానికి 40 బిలియన్ల రీయిస్ క్రెడిట్ లైన్‌ను ఆవిష్కరించింది.

అలాగే 3 నెలల లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వయం ఉపాధి, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం తరపున రూ. 45 బిలియన్ల రీయిస్‌లను అందిస్తుందని, ఇలా మూడు నెలల పాటు మొత్తం రూ. 700 బిలియన్ల రీయిస్‌లను ఇవ్వనున్నట్లు సావోపాలో ఆర్థిక మంత్రి పాలో గూడెస్ శుక్రవారం ప్రకటించించారు. అంతేగాక దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,891 నమోదు కాగా, మరణాలు 92కి చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-06-2020
Jun 05, 2020, 20:51 IST
జెరూసలెం : ఇజ్రాయెల్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ కేసులు గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం...
05-06-2020
Jun 05, 2020, 20:26 IST
కోల్‌క‌తా: ‘ఓవైపు క‌రోనా, మ‌రోవైపు అంఫ‌‌న్‌తో పోరాడుతుంటే కొన్ని పార్టీలు మ‌మ్మ‌ల్ని అధికారం నుంచి తొల‌గించాలని చూస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరం....
05-06-2020
Jun 05, 2020, 20:18 IST
వాషింగ్టన్‌: అమెరికాలో నూతనంగా 2.5 మిలియన్‌ మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలో మే నాటికి నిరుద్యోగిత రేటు 13.3...
05-06-2020
Jun 05, 2020, 18:59 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‌ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
05-06-2020
Jun 05, 2020, 18:53 IST
పట్నా : లాక్‌డౌన్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నిస్తున్న తరుణంలో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ...
05-06-2020
Jun 05, 2020, 18:40 IST
ఢిల్లీ : టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన పెట్‌ డాగ్‌తో దిగిన క్యూట్‌ ఫోటోలను...
05-06-2020
Jun 05, 2020, 17:50 IST
ముంబై: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు...
05-06-2020
Jun 05, 2020, 17:29 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా...
05-06-2020
Jun 05, 2020, 16:41 IST
ఇస్లామాబాద్‌ :  ప్రపంచ ప్రజానీకంపై పగడవిప్పుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ...
05-06-2020
Jun 05, 2020, 16:03 IST
అసాధ్యం అనుకున్న పనులెన్నిటినో కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌ సుసాధ్యం చేసింది.. ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా...
05-06-2020
Jun 05, 2020, 15:52 IST
ఢిల్లీ : క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎవ‌రూ ఎక్కడికి కదల్లేని పరిస్థితిగా మారింది. దాదాపు రెండు నెల‌ల నుంచి...
05-06-2020
Jun 05, 2020, 15:20 IST
చెన్నై: దక్షిణాదిలో తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి....
05-06-2020
Jun 05, 2020, 14:50 IST
రోమ్‌: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) ధాటికి అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఈ యూరప్‌...
05-06-2020
Jun 05, 2020, 13:30 IST
యాదాద్రి భువనగిరి, కేతేపల్లి (నకిరేకల్‌) : మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణయ్యింది....
05-06-2020
Jun 05, 2020, 13:26 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలోనూ ప్రబలుతోంది. ఈ కోవిడ్‌ లింక్‌ను తెంచేందుకు జిల్లా యంత్రాంగం అవిరళ కృషి చేస్తోంది....
05-06-2020
Jun 05, 2020, 12:59 IST
వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 
05-06-2020
Jun 05, 2020, 12:54 IST
సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా చేగుంటలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి కోలుకొని సంతోషంతో పుట్టిన...
05-06-2020
Jun 05, 2020, 12:50 IST
ఇంపాల్‌: మరణించిన తండ్రిని చూడటం కోసం అంజలి హమాంగ్టే(22) స్వగ్రామం కాంగ్‌పోక్పి వచ్చింది. దూరం నుంచే తండ్రి శవపేటికను చూస్తూ ఏడుస్తుంది....
05-06-2020
Jun 05, 2020, 12:03 IST
నాగోలు:  కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందే.. కరోనా నుంచి...
05-06-2020
Jun 05, 2020, 11:29 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్‌డౌన్‌ 5.0లో దేశవ్యాప్తంగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top