పబ్లిగ్గా ఆమెకు ప్రపోజ్‌ చేశాడు.. కానీ

Boyfriend public proposal to his girlfriend backfires - Sakshi

ప్రేమికుల రోజు సందర్భంగా ఓ మహిళకు ఆమె ప్రేమికుడు పబ్లిక్‌గా ప్రపోజ్‌ చేశాడు. వేదికపై ఆమె ముందు మోకాలిపై కూర్చొని ప్రేమగా ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చాడు. ఆ బొకేను ఆమె తీసుకోగానే.. ఎంగెజ్‌మెంట్‌ రింగ్‌ను బయటకు తీసి ఆమెకు చూపించాడు. ఆమె షాక్‌ తిన్నది. విస్మయంగా చేతులను నోటికి అడ్డుపెట్టుకొని.. తల వద్దన్నట్టూ ఊపుతూ వేదిక నుంచి దిగిపోయింది. కంటతడి పెడుతూ ఆమె వెళ్లిపోయింది. ఆ ప్రేమికుడి గుండె పగిలిపోయింది. అతడు విభ్రమతో అలాగే మోకాళ్లపై కూర్చుని ఉండిపోయాడు. అతన్ని అక్కడి వారు ఓదార్చేందుకు ప్రయత్నించారు. మెక్సికోకు చెందిన నూవో లియోన్‌ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో అతని ‘నో’... ‘హౌ బ్రూటల్‌’ (ఎంత దారుణ) అంటూ పేర్కొనడం వినొచ్చు. అయితే, ఈ వీడియోలోని జంట వివరాలు తెలియరాలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top