ఇరాన్‌లో కుప్పకూలిన విమానం | Boeing737 passenger jet crashes in Iran after take-off | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో కుప్పకూలిన విమానం

Jan 8 2020 9:13 AM | Updated on Jan 8 2020 11:23 AM

Boeing737 passenger jet crashes in Iran after take-off - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒకవైపు ఇరాన్‌ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న తరుణంలో  ప్యాసింజర్‌ విమానం కుప్పకూలిపోవడం మరింత ఆందోళన  రేపింది. బోయింగ్‌  737 విమానం  టేక్‌ ఆఫ్‌ తీసుకున్న కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక కారణాలతోనే ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది.

170 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఉక్రేనియన్ విమానం బుధవారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాజధాని టెహ్రాన్ శివారు పరాంద్ సమీపంలో బోయింగ్ 737 జెట్ కూలిపోయిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా మొత్తం 180 ప్రాణాలు కోల్పోయారు.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement