బాంబు పేలుడు : ఇద్దరు సైనికులు మృతి | Blast kills two soldiers in Afghanistan | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు : ఇద్దరు సైనికులు మృతి

Dec 25 2014 2:18 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఆఫ్ఘానిస్థాన్ లగ్మన్ ప్రావెన్స్లోని కర్గాయ్ జిల్లాలో గురువారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించారు.

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ లగ్మన్ ప్రావెన్స్లోని కర్గాయ్ జిల్లాలో గురువారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ప్రావెన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని... వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆఫ్ఘానిస్థాన్లోని నాటో దళాలు చేపట్టిన భద్రత చర్యలు డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దాంతో జనవరి 1 నుంచి ఆప్ఘానిస్థాన్లోని సైనిక దళాలే భద్రత వ్యవహారాలు పర్యవేక్షించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement