ఔషధ స్థాయిల్ని నియంత్రించే బయోసెన్సర్‌! | Biosensor regulating drug levels! | Sakshi
Sakshi News home page

ఔషధ స్థాయిల్ని నియంత్రించే బయోసెన్సర్‌!

May 16 2017 12:35 AM | Updated on Oct 16 2018 3:25 PM

ఔషధ స్థాయిల్ని నియంత్రించే బయోసెన్సర్‌! - Sakshi

ఔషధ స్థాయిల్ని నియంత్రించే బయోసెన్సర్‌!

శరీరానికి అవసరమైన మోతాదులో ఔషధాన్ని అందించే సరికొత్త బయో సెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.

బోస్టన్‌: శరీరానికి అవసరమైన మోతాదులో ఔషధాన్ని అందించే సరికొత్త బయో సెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇది దేహానికి అవసరమైన ఔషధాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కావాల్సిన మోతాదులో ఔషధాన్ని అందిస్తుంది. ఒక్కో రోగికి ఒక్కో మోతాదులో ఔషధం అవసరం ఉంటుంది.

ఒక రోగికి సరిపోయే ఔషధ మోతాదు.. మరో రోగికి అధికం కావచ్చు. దీన్ని అధిగమించేందుకు ఎంత మోతాదులో ఔషధం అవసరమో అంతే అందించే సాధనాన్ని (బయోసెన్సర్‌)ను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 3 దశల్లో పనిచేస్తుందన్నారు. ‘రక్తంలోని ఔషధ స్థాయిని బయోసెన్సర్‌ పర్యవేక్షిస్తుంది. తర్వాత ఎంత మోతాదులో ఔషధం అవసరమో అనేది ఇందులోని నియంత్రణ వ్యవస్థ అంచనా వేస్తుంది’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement