breaking news
Stanford Varsity scientists
-
చిన్న రోబో.. పెద్ద సాయం!
బోస్టన్: సీరియస్‌గా చదువుతుండగా ఎవరో డోర్‌బెల్ కొట్టారు.. వెంటనే లేచి డోర్ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైన వెళ్లి తీస్తే బాగుండనిపిస్తుంది కదూ! అందుకే మీలాంటి వారి కోసమే ఓ రోబోను తయారు చేశామంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వారు అభివృద్ధి చేసిన ఎగిరే రోబో.. రిమోట్‌తో ఆదేశిస్తే చాలు సహాయకుడిలా అన్ని చేసేస్తుందంటున్నారు. డోర్ లాక్ తీసి తలుపును తెరుస్తుంది. అంతేకాదు, దాహం వేస్తే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్‌ను సైతం తీసుకొచ్చి చేతికందిస్తుంది. ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోలను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఫ్లైక్రో టగ్స్గా పిలిచే వీటిని తొలుత తొండలు, కీటకాల నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు. గోడలపై పాకుతూ బూజు తొలగించడం, ఫ్లోర్‌పై చెత్తను తీసేయడం లాంటివి చేసేవి. తాజాగా పక్షిలా ఎగిరేలా వీటికి రెక్కలు జోడించడంతో పాటు, వాటి బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా సాంకేతికత సాయంతో సామర్థ్యాన్నీ పెంచారు. ఉపరితలానికి తగ్గట్టుగా ల్యాండ్ అయ్యేందుకు వీటికి 32 మైక్రోస్పైన్స్ కూడా అమర్చారు. ఇవి ఎక్కువ బరువును మోయడమే కాకుండా చాలా వేగంగా పని చేస్తాయని శాస్త్రవేత్త మార్క్ కట్కోస్కై తెలిపారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఔషధ స్థాయిల్ని నియంత్రించే బయోసెన్సర్!
బోస్టన్: శరీరానికి అవసరమైన మోతాదులో ఔషధాన్ని అందించే సరికొత్త బయో సెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇది దేహానికి అవసరమైన ఔషధాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కావాల్సిన మోతాదులో ఔషధాన్ని అందిస్తుంది. ఒక్కో రోగికి ఒక్కో మోతాదులో ఔషధం అవసరం ఉంటుంది. ఒక రోగికి సరిపోయే ఔషధ మోతాదు.. మరో రోగికి అధికం కావచ్చు. దీన్ని అధిగమించేందుకు ఎంత మోతాదులో ఔషధం అవసరమో అంతే అందించే సాధనాన్ని (బయోసెన్సర్)ను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 3 దశల్లో పనిచేస్తుందన్నారు. ‘రక్తంలోని ఔషధ స్థాయిని బయోసెన్సర్ పర్యవేక్షిస్తుంది. తర్వాత ఎంత మోతాదులో ఔషధం అవసరమో అనేది ఇందులోని నియంత్రణ వ్యవస్థ అంచనా వేస్తుంది’ అని అన్నారు.