హన్నా.. నాన్న.. | Beware of the Boys | Sakshi
Sakshi News home page

హన్నా.. నాన్న..

Apr 25 2015 1:13 AM | Updated on Sep 3 2017 12:49 AM

హన్నా.. నాన్న..

హన్నా.. నాన్న..

అమ్మాయిల వెంట పోకిరీలు పడటం.. ఈవ్‌టీజింగ్ వంటివి సాధారణమైపోయాయి.

అమ్మాయిల వెంట పోకిరీలు పడటం.. ఈవ్‌టీజింగ్ వంటివి సాధారణమైపోయాయి. మరి దీనికి పరిష్కారమెలా? ఈ చిత్రంలోని వ్యక్తి వీటికో వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ టీ షర్ట్‌పై తన ఫొటోతో పాటు ‘బాయ్స్ జాగ్రత్త.. వీడు మా నాన్న’ అన్న వాక్యాలు ప్రింట్ చేయించి.. తన కుమార్తెకు వేసుకోమని ఇచ్చాడు.

వాళ్ల నాన్న ఫొటో చూశారుగా.. ఒక్క గుద్దుకే చంపేసేటట్లున్నాడు. అబ్బాయిలు వెంట పడటం సంగతి అలా ఉంచితే.. కన్నెత్తి చూడ్డానికే భయపడేలా ఉందా బాడీ.. వీరు ఎక్కడివారు అన్న విషయం తెలియకపోయినా.. ప్రస్తుతం ఈ ఫొటో ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన జుజిట్సూ(ఇదో మార్షల్ ఆర్ట్) ప్రపంచ చాంపియన్ కిట్ డేల్ తొలిసారిగా ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తెలివైన నాన్న అంటూ కామెంట్ పెట్టారు. అక్కడ్నుంచి ఇది లక్షలాది లైకులు, కామెంట్లతో దూసుకుపోతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement