పోటీ బైడెన్, శాండర్స్‌ మధ్యే!

Bernie Sanders or Joe Biden win the Electoral College - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎవరనే విషయంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, పార్లమెంటు సభ్యుడు బెర్నీ శాండర్స్‌ల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అమెరికాలోని పద్నాలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన ప్రైమరీ (అభ్యర్థి ఎన్నిక) ఎన్నికల్లో ఇద్దరూ గణనీయమైన విజయాలు సాధించారు. సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్‌ తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, శాండర్స్‌.. కాలిఫోర్నియా, కొలరాడో, యూటా, వెర్మాంట్‌లో తన ఆధిక్యత చాటుకున్నారు.

దీంతో వీరిద్దరిలో ఒకరు నవంబర్‌ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్‌ పార్టీ తరఫున నిలబడనున్నారు. ఎన్‌బీసీ న్యూస్‌ అంచనాల ప్రకారం బైడెన్‌ మంగళవారంనాటి ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 342 మంది ప్రతినిధుల మద్దతు గెల్చారు. మునుపు జరిగిన ఎన్నికలను కలిపి చూసుకుంటే మొత్తం 395 మంది ప్రతినిధుల మద్దతు బైడెన్‌కు దక్కాయి. శాండర్స్‌ మంగళవారంనాటి ప్రైమరీల ద్వారా 245 మంది మద్దతు, మొత్తమ్మీద 305 మంది మద్దతు లభించింది. కాలిఫోర్నియాలో ఆధిక్యత సాధించడం ద్వారా శాండర్స్‌ తాను డెమొక్రటిక్‌ తరఫున అభ్యర్థి రేసులో ఉన్నానని నిరూపించుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top