బంగ్లాతో నేరస్తుల అప్పగింత సులభం | Bangladesh Cabinet Okays Easier Extradition With India | Sakshi
Sakshi News home page

బంగ్లాతో నేరస్తుల అప్పగింత సులభం

Jul 19 2016 12:22 PM | Updated on Sep 4 2017 5:19 AM

నేరస్తుల అప్పగింతకు సంబంధించి భారత్‌తో ఉన్న ఒప్పందంలో సవరణకు బంగ్లాదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఢాకా: నేరస్తుల అప్పగింతకు సంబంధించి భారత్‌తో ఉన్న ఒప్పందంలో సవరణకు  బంగ్లాదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అప్పగింత మరింత సులభం కానుంది. బంగ్లా  ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన జరిగిన కేబినెట్  భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏదైనా కోర్టు నుంచి, ట్రిబ్యునల్ నుంచి వారెంట్ జారీ అయి ఉన్న భారతీయ నేరస్తుడు బంగ్లాలో తలదాచుకున్నట్లైతే, అతడిని భారత ప్రభుత్వానికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement