ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం | Authorities investigating Atlanta Craigslist ad to sell unborn baby for drugs | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం

Jun 5 2015 9:35 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం - Sakshi

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం

'ఆరు నెలల గర్భవతిని. తెల్లని పండంటి బిడ్డ గ్యారెంటీ. కావాల్సిన వారు డబ్బులిచ్చి లేదా డ్రగ్స్ ఇచ్చి కొనుక్కోవచ్చు' అమెరికాలోని

అట్లాంటా: 'ఆరు నెలల గర్భవతిని. తెల్లని పండంటి బిడ్డ గ్యారెంటీ. కావాల్సిన వారు డబ్బులిచ్చి లేదా డ్రగ్స్ ఇచ్చి కొనుక్కోవచ్చు'  అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటాలో ఓ అమ్మ క్రెయిగ్లిస్ట్ అట్లాంటా ఫేస్బుక్ పేజీలో (May 22)  ఇచ్చిన ప్రకటన ఇది. ఇలా డబ్బు, డ్రగ్స్ కోసం పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టిన ఈ అమ్మపై వందలాది నెటిజన్లు మండిపడుతూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

 

దీంతో జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు.  అధికారులు ఈ యాడ్కు సంబంధించి సుమారు 100 ఫోన్కాల్స్ అందుకున్నారు. ఇది ఆకతాయి అమ్మ పనా? లేక నిజమా? అనేది తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement