‘కోవిడ్‌’ నియంత్రణలో కీలక అడుగు! | Australian Researchers Claim Two Existing Drugs Could Cure CoronaVirus | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌కు రెండు మందులు

Mar 17 2020 8:41 AM | Updated on Mar 17 2020 8:41 AM

Australian Researchers Claim Two Existing Drugs Could Cure CoronaVirus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మెల్‌బోర్న్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌కు రెండు మందులను గుర్తించినట్లు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. ఈ రెండు ఔషధాలలో ఒకటి హెచ్‌ఐవీ కోసం, రెండోది మలేరియా వ్యాధి కోసం ఇప్పటికే వాడుతున్నారని, పరిశోధనశాలలో ఇవి వైరస్‌ను సమర్థంగా అడ్డుకోగలిగాయని సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ పాటర్సన్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో కోవిడ్‌-19 బారిన పడ్డ వారిలో కొందరికి వీటిల్లో ఒక మందు ఇచ్చి సత్ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. ఈ మందును మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా ఆస్ట్రేలియాలోని 50 ఆసుపత్రుల్లో ప్రయోగాలు నిర్వహించనున్నామని, ఈ మందును.. రెండు మందులను కలిపి ఇచ్చి ఫలితాలను బేరీజు వేస్తామని చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పరీక్షలు మొదలవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత తొందరగా కోవిడ్‌ బాధితులకు ఈ మందులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘కోవిడ్‌’ దిగ్బంధనం)

హెచ్‌ఐవీ మందులు కీలకం
హెచ్‌ఐవీ చికిత్సకు వాడే రెండు మందులను వాడటం రాజస్థాన్‌లో కోవిడ్‌ నియంత్రణలో కీలకపాత్ర పోషించాయని రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ రోహిత్‌ కుమార్‌ సింగ్‌ సోమవారం తెలిపారు. రాజస్థాన్‌లో వ్యాధి బారిన పడ్డ నలుగురిలో ముగ్గురికి నయమైంది. ఇటలీ దంపతులు మొదటగా వ్యాధి బారిన పడగా వారికి తాము మలేరియా, స్వైన్‌ఫ్లూ మందులు ఇచ్చామని, ఆ తరువాత భారత వైద్య పరిశోధనల సమాఖ్యతో సంప్రదింపులు జరిపి కరోనా చికిత్సకు హెచ్‌ఐవీ మందులు వాడామని వివరించారు. రెండు మందులు కలిపి ఇవ్వడం సత్ఫలితాలిచ్చిందని, వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ ముగ్గురికీ నయంకావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. (కరోనా మరణాలు @ 7007)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement