మరో సూర్‌ ఎర్త్‌!

Astronomers discover super-Earth around Barnard's star - Sakshi

సూర్యుడికి పొరుగునే కనుగొన్న శాస్త్రవేత్తలు

లండన్‌: ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్‌ నక్షత్రం చుట్టూ ఈ సూపర్‌ ఎర్త్‌ తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మైనస్‌ 170 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్‌ చుట్టూ పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు. రాళ్లు, మంచుతో కూడిన ఈ గ్రహంపై నీటి వనరులు పుష్కలమని, కానీ, కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్‌ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు. కనుగొనడానకి ముందు శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి సంబంధించి 20 ఏళ్లుగా చేస్తున్న సర్వేలు, పరిశోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తొలిసారి రేడియల్‌ వెలాసిటీ పద్ధతి సాయంతో ఈ గ్రహాన్ని గుర్తించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top