భారత ఐటీ ఉద్యోగులకు మరో షాక్‌! | Another shock to the employees of the Indian IT! | Sakshi
Sakshi News home page

భారత ఐటీ ఉద్యోగులకు మరో షాక్‌!

Jan 21 2017 2:53 AM | Updated on Apr 4 2019 3:48 PM

భారత ఐటీ ఉద్యోగులకు మరో షాక్‌! - Sakshi

భారత ఐటీ ఉద్యోగులకు మరో షాక్‌!

అమెరికా భారత ఐటీ వర్గాలకు మరో షాకివ్వనుంది. హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు

  • హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం
  • అక్కడ వర్సిటీల్లో చదివినవారికే ప్రాధాన్యం
  • వాషింగ్టన్‌: అమెరికా భారత ఐటీ వర్గాలకు మరో షాకివ్వనుంది. హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు చుక్‌ గ్రాస్లే, డిక్‌ డర్బన్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన విదేశీయులకే హెచ్‌1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టభద్రులు, అధిక వేతనం పొందే నిపుణులకు కూడా అవకాశం ఇస్తారు.

    ‘అమెరికాలో అత్యున్నత స్థాయి శ్రామిక శక్తిని నింపడానికే ఈ ప్రతిపాదన. దురదృష్టవశాత్తూ ఇక్కడి కంపెనీలు అమెరికన్లను కాదని తక్కువ వేతనానికి వస్తున్న విదేశీయులను తెచ్చుకొంటున్నాయి.  విదేశీ నిపుణుల కోసం  బయటి ఉద్యోగుల కంటే ఇక్కడ చదివిన వారికే మొదట అవకాశం కల్పిస్తాం’అని సెనేటర్లు వెల్లడించారు. అలాగే 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ఔట్‌సోర్స్‌ కంపెనీలు అదనంగా హెచ్‌1బీ/ఎల్‌1 వీసాలున్నవారిని నియమించుకోవడానికి కూడా నిబంధనలు అనుమతించవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement