అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి | Another Hindu temple vandalised in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి

Apr 20 2015 9:49 AM | Updated on Aug 24 2018 7:24 PM

అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి - Sakshi

అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి

అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లోని హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేసిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వాషింగ్టన్: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లో కొలువై ఉన్న  హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలను అతికించారు.  దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తమ దృష్టికి గత సోమవారం వచ్చినట్లు పేర్కొన్నారు.  ఈ తరహా సంఘటన నిజంగా బాధాకరమని తెలిపారు. ఇది మొత్తం ఒక జాతినే అవమానపరిచే చర్యగా ఆయన అభివర్ణించారు.

 

కాగా, ఆ దుండుగుల కోసం డల్లాస్ పోలీసులు, డిటెక్టివ్ ఏజెన్సీలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడు నెలల్లో  అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం మూడోసారి.  ఇదే తరహా ఘటన గడిచిన ఫిబ్రవరి నెలలో  సియాటెల్ ప్రాంతంలోని దేవాలయం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement