చారిత్రక సంప్రదాయం.. ఎద్దుల పోట్లాట! | Ancient bull fighting festival in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో జోరుగా బుల్‌ఫైటింగ్‌

Jan 16 2018 9:13 AM | Updated on Oct 1 2018 6:33 PM

Ancient bull fighting festival in Nepal - Sakshi

నూవకోట్‌(నేపాల్‌): పొరుగుదేశం నేపాల్‌లోనూ పండుగ సందడి నెలకొంది. చంద్రమాన క్యాలెండర్‌ పదోనెల ‘మాఘ్‌’  ప్రారంభోత్సవం సందర్భంగా నేపాల్‌ అంతటా మోలాసెస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక, కఠ్మాండుకు 75 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య నెలకొన్న నువాకోట్‌ జిల్లాలో ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక సంప్రదాయ క్రీడలు జరుగుతున్నాయి. మన దగ్గర కోళ్ల పందేలు జరిగినట్టే.. ఇక్కడ కోడెద్దుల పందేం జరుగుతుంది. మధించిన ఎద్దుల మధ్య పోరాటాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఎద్దుల పోరాటానికి 225 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది హోరాహోరీగా జరిగే ఈ బుల్‌ఫైటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు.

చారిత్రక ప్రాధాన్యం..
నూవాకోట్‌ జిల్లాలో నిర్వహించే ఎద్దుల కొట్లాటకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1887లో అప్పటి రాజకుమారుడు బఝాంగ్‌ జాయ్‌ పృథ్వీ బహదూర్‌ సింగ్‌ తొలిసారి ఈ క్రీడను ప్రవేశపెట్టారు. ఆయన తొలిసారి అత్తగారింటికి వచ్చిన సందర్భంగా వినోదం కోసం తొలిసారి ఎద్దుల మధ్య పోరాటం నిర్వహించారు. అప్పటి నుంచి సంప్రదాయంగా ఈ ఎద్దుల ఫైటింగ్‌ జరుగుతుంది. తమిళనాడులో జల్లికట్టు, స్పానిష్‌లో బుల్‌ఫైటింగ్‌ తరహాలో ఇక్కడ కూడా ఎద్దుల కొట్లాట హోరాహోరీగా సాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement