లాక్‌డౌన్‌: భారత్‌ నుంచి అమెరికన్ల తరలింపు!

Amid Lockdown America Stars Airlifting Citizens From India - Sakshi

న్యూయార్క్‌: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను తరలించేందుకు ఆ దేశం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈమేరకు అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు పంపిన మెయిల్‌ ప్రకారం తొలి చార్టర్డ్‌ ఫ్లైట్‌ శనివారం బయల్దేరి వెళ్లినట్టు  తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబై నుంచి అట్లాంటా మధ్య అమెరికా విమానాలు ఈ ప్రయాణం సాగిస్తాయి. ఢిల్లీలో ఉన్న 1500 మంది, ముంబైలో ఉన్న 600- 700 మంది, ఇతర ప్రాంతాలోన్న 300 నుంచి 400 మంది స్వదేశానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అమెరికా హోంశాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ​ఇయాన్‌ బ్రోన్‌లే పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లొద్దని, ఇతర దేశాల్లో ఉన్నవారు అమెరికాకు తిరిగా రావాలని మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
(చదవండి: భారత్‌ సహాయాన్ని కోరిన ట్రంప్‌)

ఎప్పటివరకు విమానాల రాకపోకలు కొనసాగుతాయో చెప్పలేమని, సాధ్యమైనంత త్వరగా భారత్‌లో ఉన్నవారు స్వదేశానికి వచ్చేయాలని అన్నారు. అయితే, అమెరికాలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని, అన్ని రిస్కులు తెలుసుకుని వస్తే మంచిదని సూచించారు. అమెరికా పౌరులతో పాటు, యూఎస్‌ పౌరసత్వం కల్గినవారు, గ్రీన్‌ కార్డు హోల్డర్లు, వీసా హోల్డర్లు కూడా ప్రత్యేకంగా నడపనున్న విమనాల్లో రావొచ్చునని తెలిపారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఢిల్లీ, ముంబై చేరుకునేందుకు డొమెస్టిక్‌ విమానాలు, దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం బస్సులు నడపడాలని భారత్‌ను కోరామని బ్రోన్‌లే తెలిపారు. ఇక విదేశాల్లో ఉన్నవారిని రప్పించేందుకు భారత్‌ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
(చదవండి: గుడ్‌న్యూస్‌: ఒక్క డోస్‌తో కోవిడ్‌-19 ఆట కట్టించొచ్చు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top