గుడ్‌న్యూస్‌: ఒక్క డోస్‌తో కోవిడ్‌-19 ఆట కట్టించొచ్చు!

Ivermectin Drug Kills Coronavirus Cell Cultures In 48 Hours Says Study - Sakshi

శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా పరిశోధకులు

మెల్‌బోర్న్‌: కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు శుభవార్త చెప్పారు. అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’తో కోవిడ్‌-19 ను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈమేరకు మోనాష్‌ యూనివర్సిటీ బయోమెడిసిన్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ (బీడీఐ), డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. హెచ్‌ఐవీ, జికా వైరస్‌, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్‌మెక్టిన్‌కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్‌ క్రిములను పారదోలే శక్తి ఉందని స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్‌ కైలీ వాగ్‌స్టాఫ్‌ చెప్పారు. 
(చదవండి: భారత్‌ సహాయాన్ని కోరిన ట్రంప్‌)

ఆయన మాట్లాడుతూ.. ‘ఐవర్‌మెక్టిన్‌ అనే ఔషధం ఎఫ్‌డీఏ అనుమతి పొందిన డ్రగ్‌. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్‌ కూడా. పలు వైరల్‌ ఫీవర్లపై ఐవర్‌మెక్టిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనితో మానవ శరీరంలో సెల్‌ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్‌ సింగిల్‌​ డోస్‌ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో  24 గంటల్లో ​మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈమెడిసిన్‌తో చికిత్స చేస్తే మంచిది’అని వాగ్‌స్టాఫ్‌ పేర్కొన్నారు. అయితే, ల్యాబ్‌ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తమ అధ్యయన వివరాలు యాంటి వైరల్‌ రిసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయని తెలిపారు.
(చదవండి: 5జీతో క‌రోనా దుర్మార్గ ప్ర‌చారం: బ‌్రిట‌న్‌)
(చదవండి: అమెరికాలో మూడు లక్షలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top