భారత్‌ సహాయాన్ని కోరిన ట్రంప్‌

Trump Urges PM Modi To Export Antimalarial Drug - Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది.  లక్షలాది మంది వైరస్‌ బారిన పడగా.. వేలాది మంది మృత్యువాత పడ్డారు. సామాన్యులే కాక  ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు అంటే వైరస్‌ తీవ్రత ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రా​క్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. (వాషింగ్టన్‌లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌)

కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. ఈ మేరకు శనివారం మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను యూఎస్ కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు భారత్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిపై ఇప్పటివరకు ఉన్న నిషేదాన్ని తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో మోదీని హైడ్రాక్వీ క్లోరోక్విన్ టాబ్లెట్ల సరఫర చేయమని విజ్ఞప్తి చేశాను’ అని  ట్రంప్ పేర్కొన్నారు. (ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ)

ఈ మెడిసిన్‌ కోసం అమెరికా ఇప్పటికే భారత్‌కు ఆర్డర్ అందించిందని, అయితే, ప్రస్తుతం భారత నిషేధం అమలులో ఉన్నందున ఇంకా సరఫరా జరగలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగం‍గా శనివారం వైట్‌హౌస్‌లో యూఎస్‌ అధికారులతో సమీక్ష చేపట్టిన ట్రంప్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం అభినందనీయమన్నారు. కాగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహ్మమారిని తరిమికొట్టేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-05-2020
May 23, 2020, 05:03 IST
లండన్‌: కరోనా వైరస్‌పై పోరులో లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కీలకమైన ముందడుగు వేసింది. వైరస్‌ను నివారించే టీకాను పదివేల మందిపై...
23-05-2020
May 23, 2020, 04:23 IST
కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది....
23-05-2020
May 23, 2020, 01:02 IST
ముంబై: కరోనా వైరస్‌ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన...
23-05-2020
May 23, 2020, 00:31 IST
‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు...
23-05-2020
May 23, 2020, 00:05 IST
లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు....
22-05-2020
May 22, 2020, 21:12 IST
రాంచెస్ట‌ర్: 'పిల్ల‌ల‌కేం తెలుసు?', 'వాళ్ల‌కేం తెలీదు?' ఇలాంటి మాట‌ల‌ను చాలాసార్లు విన్నాం, వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉంటాం కూడా! కానీ ఇది...
22-05-2020
May 22, 2020, 20:57 IST
సాక్షి కామారెడ్డి : జిల్లా కరోనా వైరస్‌ రహిత జిల్లాగా మారిందని  రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల...
22-05-2020
May 22, 2020, 20:27 IST
సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్‌ మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్‌ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా...
22-05-2020
May 22, 2020, 20:25 IST
కరోనా మహమ్మారి ప్రధానమంత్రులను వదలడం లేదు.
22-05-2020
May 22, 2020, 20:18 IST
ముంబై: అస్వ‌స్థ‌త‌గా ఉందంటూ అంబులెన్స్ కోసం ఆస్ప‌త్రికి కాల్ చేసిన క‌రోనా బాధితుడికి నిరాశే ఎదురైంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లి ఆస్ప‌త్రికి...
22-05-2020
May 22, 2020, 18:17 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేడు పిల్లలు కలగకుండా ఉండేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషుల కండోమ్స్, స్త్రీల కండోమ్స్‌తోపాటు...
22-05-2020
May 22, 2020, 17:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ  మారుతి సుజుకి  కూడా తన వినియోగదారులకు...
22-05-2020
May 22, 2020, 16:37 IST
బీజింగ్‌: ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌కు  చైనాలో ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదు.  కరోనా వైరస్‌ సంక్షోభ  సమయంలో కూడా  అక్కడ తన...
22-05-2020
May 22, 2020, 16:31 IST
ముంబై: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం...
22-05-2020
May 22, 2020, 15:50 IST
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు తగ్గింపు చర్య పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ను బలహీన పర్చడంతో దేశీయ...
22-05-2020
May 22, 2020, 15:14 IST
భోపాల్‌: పెళ్లైన రెండు రోజుల‌కే ఓ యువ‌తికి క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో అటు వ‌ధూవ‌రుల‌ కుటుంబాల‌తోపాటు పెళ్లికి వ‌చ్చిన బంధువుల్లోనూ...
22-05-2020
May 22, 2020, 14:53 IST
సాక్షి, బెంగళూరు: కోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ ఆంక్షల్లో చిక్కుకుని స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలు...
22-05-2020
May 22, 2020, 14:34 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల...
22-05-2020
May 22, 2020, 14:30 IST
ఢాకా: యాంటీ- పారాసైట్‌ డ్రగ్‌, ప్రతిరక్షకాల కాంబినేషన్‌తో మహమ్మారి కరోనాను కట్టడి చేయవచ్చంటున్నారు బంగ్లాదేశ్‌ వైద్య నిపుణులు. కరోనా పేషెంట్ల...
22-05-2020
May 22, 2020, 14:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : బెస్ట్‌ పబ్లిక్‌ బస్‌ సర్వీసెస్‌ పరిధిలోని దక్షిణ ముంబై డిపోలో కండక్టర్‌గా పని చేస్తోన్న కిషన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top