అమెరికా నిఘాకు చిక్కని ‘ప్రోటాన్‌మెయిల్’! | america eyes on emails | Sakshi
Sakshi News home page

అమెరికా నిఘాకు చిక్కని ‘ప్రోటాన్‌మెయిల్’!

May 19 2014 2:01 AM | Updated on Apr 4 2019 3:25 PM

నెటిజన్ల ఈ-మెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎస్‌ఏ నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఇతరులు చూసేందుకు వీలులేని కొత్త ఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీసు ‘ప్రోటాన్‌మెయిల్’ను శుక్రవారం ఓ కంపెనీ ప్రారంభించింది.

  కొత్త ఉచిత ఈ-మెయిల్ సర్వీసు ప్రారంభం  
 
 వాషింగ్టన్: నెటిజన్ల ఈ-మెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎస్‌ఏ నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఇతరులు చూసేందుకు వీలులేని కొత్త ఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీసు ‘ప్రోటాన్‌మెయిల్’ను శుక్రవారం ఓ కంపెనీ ప్రారంభించింది. ఈ ఉచిత సర్వీసుతో ఈ-మెయిళ్లకు కొత్త ఎన్‌క్రిప్షన్ పద్ధతితో పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.  ఎంఐటీ, సెర్న్ శాస్త్రవేత్తలతో కలిసి తాము ప్రోటాన్‌మెయిల్‌ను రూపొందించినట్లు ఈ-మెయిల్ సర్వీసు కో-డెవలపర్ జాన్ స్టాక్‌మన్ వెల్లడించారు. దీని సర్వర్లు స్విట్జర్లాండ్‌లోనే ఉంటాయన్నారు. ఇందులో ఎలాంటి ఇన్‌స్టాల్స్ లేకుండా అన్ని పనులూ పరోక్షంగానే జరుగుతాయని, అందువల్ల అమెరికా సంస్థలు వీటిలోకి చొరబడటం అంత సులభం కాదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement