'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం' | Al-Shabaab claims killing 12 Kenyan soldiers | Sakshi
Sakshi News home page

'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం'

Mar 20 2016 8:56 AM | Updated on Sep 3 2017 8:12 PM

'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం'

'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం'

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షహబ్ దారుణానికి పాల్పడింది. పన్నెండుమంది సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మరో ఇద్దరిని తమ అదుపులో ఉంచుకున్నట్లు ప్రకటించింది.

మోగాదిషు: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షహబ్ దారుణానికి పాల్పడింది. పన్నెండుమంది కెన్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మరో ఇద్దరిని తమ అదుపులో ఉంచుకున్నట్లు తెలిపింది.

కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్(కేడీఎఫ్)కు అల్ షహబ్ ఉగ్రవాదులకు మధ్య భారీ ఎత్తున పోరు జరిగిందని, ఇందులో కొంతమంది సైనికులను బందించిన అల్ షహబ్ వారిని చంపేసినట్లు ప్రకటించిందని కెన్యా మీడియా సంస్థ వెల్లడించింది. దక్షిణ సోమాలియాలోని జుబ్బా ప్రాంతంలోగల కోకాని అనే గ్రామం వద్ద ఇది చోటుచేసుకున్నట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement