కెన్యాలో కుప్పకూలిన 18 అంతస్తుల భవనం  | 18-storey building under construction collapses in Eastleigh Kenya | Sakshi
Sakshi News home page

కెన్యాలో కుప్పకూలిన 18 అంతస్తుల భవనం 

Oct 24 2026 6:14 AM | Updated on Oct 24 2026 6:14 AM

18-storey building under construction collapses in Eastleigh Kenya

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదకరమైన స్థాయిలో పనులు జరుగుతున్నందునే భవనం పేకమేడలా కూలి, శిథిలాల దిబ్బగా మారిదని చెబుతున్నారు. నగరంలోని వాణిజ్య ప్రాంతమైన ఈస్టలీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. 

దీంతో, ఒక్కసారిగా దుమ్ము, పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ భవనంలో ఉన్న తమ వారి కోసం పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. పోలీసులు లాఠీచార్జితో వారిని అదుపు చేయాల్సి వచ్చింది. చుట్టూ ఆకాశహరŠామ్యలే ఉండటంతో ఇరుకైన ఆ ప్రాంతంలో సహాయక చర్యలను చేపట్టడం అవరోధంగా మారిందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుబడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement