కుక్కకు గ్రాండ్‌ రిటైర్‌మెంట్‌ పార్టీ..! | Airport honors service dog with fabulous retirement party | Sakshi
Sakshi News home page

కుక్కకు గ్రాండ్‌ రిటైర్‌మెంట్‌ పార్టీ..!

Jun 18 2017 3:24 PM | Updated on Sep 5 2017 1:56 PM

కుక్కకు గ్రాండ్‌ రిటైర్‌మెంట్‌ పార్టీ..!

కుక్కకు గ్రాండ్‌ రిటైర్‌మెంట్‌ పార్టీ..!

ఉద్యోగులు రిటైర్‌ అవుతారు.. ఆ సందర్భంగా పార్టీ చేసుకోవడం తెలిసిందే

వాషింగ్టన్‌: ఉద్యోగులు రిటైర్‌ అవుతారు.. ఆ సందర్భంగా పార్టీ చేసుకోవడం తెలిసిందే. కానీ ఇక్కడ రిటైర్‌ అయింది ఉద్యోగి(మనిషి) కాదు.. ఓ కుక్క.

అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో జెమా అనే ఓ కుక్క పనిచేసింది. దాదాపు ఐదేళ్లపాటు సేవలందించి గత వారం రిటైర్‌ అయింది. దాని సేవలకు కృతజ్ఞతగా ఎయిర్‌పోర్టు సిబ్బంది రిటైర్‌మెంట్‌ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో జెమా అందించిన సేవలను గుర్తుచేసుకొని దానికి కిరీటం పెట్టి సన్మానించారు. అంకితభావం కలిగిన, విశ్వసనీయమైన తమ సిబ్బంది రిటైర్మెంట్‌ సందర్భంగా తాము పార్టీ చేసుకున్నామని దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement