మెదడుపైనా కాలుష్య ప్రభావం

Air Pollution Cause The Damage To Human Brain - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాయు కాలుష్యం వల్ల ప్రజలకు శ్వాసకోస వ్యాధులు సంక్రమిస్తాయని ఇంతకాలం పరిశోధకులు భావిస్తూ వచ్చారు. కానీ వాయు కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపక శక్తి పడిపోతుందని, మొదడుకూ అనూహ్యంగా పదేళ్ల వృద్ధాప్యం వస్తుందని, దీనికి వాయువులో ఉండే ‘నైట్రోజెన్‌ డై ఆక్సైడ్‌ (ఎన్‌ఓ 20),  దూళి (పీఎం 20) కణాల వల్ల ఈ నష్టాలు సంభవిస్తాయని వార్‌విక్‌ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. వారు ముందుగా ఓ ల్యాబ్‌లోని వాతావరణ కాలుష్యంపై ముందుగా పరిశోధనలు నిర్వహించి అనంతరం, వారు లండన్‌లో వాయు కాలుష్యంపై అధ్యయనం జరిపారు. 

వాయు కాలుష్యం బారిన పడిన వారిపై అధ్యయనం జరపగా వారిలో కొందరి మెదడు వయస్సు ‘50 నుంచి 60కి’ పెరిగినట్లు అనిపించిందని పరిశోధకులు చెప్పారు. మొదట్లో ఎలుకల్లో కాలుష్యం ప్రభావాన్ని ల్యాబ్‌ పరీక్షల ద్వారా అంచనా వేసిన ఆండ్రీవ్‌ ఓస్‌వాల్డ్, నట్టావుద్‌ పౌడ్తావిలు మనుషులపై కూడా ఇలాంటి ప్రభావమే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వారు లండన్‌ నగరానికి చెందిన 34 వేల మంది పౌరులను ఎంపిక చేసుకొని, వారిపై వాతావరణ కాలుష్యం ప్రభావాన్ని అంచనావేశారు. 

ఎంపిక చేసిన పౌరుల ఉద్యోగ హోదా, విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేశారు. పదాలను గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి పరీక్ష ద్వారా మెదడు వయస్సు, దానిపై కాలుష్యం ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు. శ్వాసకోశ వ్యాధులే కాకుండా కాలుష్యం వల్ల మెదడుకు త్వరగా వయస్సు మీరిన లక్షణాలు వస్తాయన్న విషయాన్ని ప్రపధమంగా కనిపెట్టినట్లు చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top