136 మంది ప్రయాణికులు.. దారితప్పిన విమానం..! | Air India Plane Landed Wrong On Under Construction Runway | Sakshi
Sakshi News home page

Sep 7 2018 8:58 PM | Updated on Sep 15 2018 8:43 PM

Air India Plane Landed Wrong On Under Construction Runway - Sakshi

నిర్మాణంలో ఉన్న రన్‌వేపై దిగిన ఎయిరిండియా విమానం

మాలే విమనాశ్రయంలో దిగే క్రమంలో నిర్మాణంలో ఉన్న రన్‌వేపై ల్యాండ్‌ కావడంతో ఒక్కసారిగా విమానం..

సాక్షి, న్యూఢిల్లీ : పర్యవేక్షణా లోపం కారణంగా ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మాలే విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. 136 మంది ప్రయాణికులతో కూడిన ఎ-320 ఎయిరిండియా విమానం తిరువనంతపురం నుంచి మాల్దీవులకు బయల్దేరింది. మాలే విమనాశ్రయంలో దిగే క్రమంలో నిర్మాణంలో ఉన్న రన్‌వేపై ల్యాండ్‌ కావడంతో ఒక్కసారిగా విమానం టైర్లు తీవ్ర ఘర్షణకు గురయ్యాయని ఎయిరిండియా అధికారి వెల్లడించారు. టైర్లు మట్టిలో కూరుకుపోవడంతో విమానం ఆ పక్కనే ఉన్న పార్కింగ్‌ బే (వాహనాల పార్కింగ్‌)వైపు దూసుకెళ్లిందని తెలిపారు. అయితే, తప్పిదాన్ని గ్రహించిన పైలట్‌ వెంటనే బ్రేకులు వేయడంతో విమానం నిలిచిపోయిందని అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారి పేర్కొన్నారు. కాగా, ఘటనపై స్పందించిన డీజీసీఏ ఇద్దరు పైలట్లను తొలగించింది. విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement