నోబెల్ స్వీకరిస్తా: డిలన్ | Accepting the Nobel Prize: Dylan | Sakshi
Sakshi News home page

నోబెల్ స్వీకరిస్తా: డిలన్

Oct 30 2016 1:12 AM | Updated on Sep 4 2017 6:41 PM

నోబెల్ స్వీకరిస్తా: డిలన్

నోబెల్ స్వీకరిస్తా: డిలన్

నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించినా మౌనంగా ఉన్న అమెరికా గేయరచయిత, గాయకుడు బాబ్ డిలన్ ఎట్టకేలకు పెదవి విప్పారు.

స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించినా మౌనంగా ఉన్న అమెరికా గేయరచయిత, గాయకుడు బాబ్ డిలన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. స్టాక్‌హోంలో డిసెంబరు 10న ఈ అవార్డు అందుకోవాలని అనుకుంటున్నట్లు శుక్రవారం చెప్పారు. మరోవైపు డిలన్ నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి రాకపోయినా ఇబ్బందేమీ లేదనీ, ఆయన తరఫున ఏదైనా ఉపన్యాసం, ప్రదర్శన, పాటను ఉత్సవం సమయంలో అందించినా చాలని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.

అక్టోబరు 13న సాహిత్య నోబెల్ బహుమతి ప్రకటించాక, పలుమార్లు ఫోన్‌లో బాబ్‌డిలన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని స్వీడిష్ అకాడమీ సభ్యుడు గతంలో ఫిర్యాదు చేశారు. బాబ్‌డిలన్ బహుమతిని అందుకునే ఉద్దేశంతో ఉన్నారో లేదో కూడా తెలియజేయలేదనీ, ఇది ఆయన అహంకారానికి ప్రతీక అని ఆ సభ్యుడు ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement