భార్య కోరిక తీర్చేందుకు.. 90 ఏళ్ల వృద్దుడికి పెళ్లి | 90-year-old widower remarries to honour his dying wife's wish | Sakshi
Sakshi News home page

భార్య కోరిక తీర్చేందుకు.. 90 ఏళ్ల వృద్దుడికి పెళ్లి

Oct 27 2013 4:19 PM | Updated on Sep 2 2017 12:02 AM

తొమ్మిది పదుల వృద్దాప్యంలో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. చనిపోయిన భార్య కోరిక తీర్చేందు కోసం ఆయన కుమార్తెలే తగిన వధువును చూసి వివాహం జరిపించారు.

తొమ్మిది పదుల వృద్దాప్యంలో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. చనిపోయిన భార్య కోరిక తీర్చేందు కోసం ఆయన కుమార్తెలే తగిన వధువును చూసి వివాహం జరిపించారు. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది.

90 ఏళ్ల ఫతీస్ అల్ తఖాఫీ భార్య ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఏడుగురు కుమారులు. పెళ్లి చేసుకునేందుకు మొదట్లో తఖాపీ అంగీకరించలేదు. అమ్మ ఆత్మ శాంతించాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనని పిల్లలు పట్టుపట్టడంతో అంగీకరించాడు. కూతుళ్లు మూడు నెలల పాటు సంబంధాలు చూసి చివరకు 53 ఏళ్ల వితంతువును తగిన జోడీగా ఎంపిక చేశారు. వధువుకు శుల్కంగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరై తఖాఫీ పెళ్లిని ఘనంగా జరిపించారు. మొత్తానికి సెంచరీకి చేరువలో మళ్లీ పెళ్లికొడుకయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement