80 వేల సార్లు లవ్‌ ఫెయిల్యూర్‌! | 80 thousand times love Failure | Sakshi
Sakshi News home page

80 వేల సార్లు లవ్‌ ఫెయిల్యూర్‌!

Jul 1 2018 1:31 AM | Updated on Jul 1 2018 4:27 AM

80 thousand times love Failure - Sakshi

దేవదాసు సినిమా చూశారా.. పార్వతికి పెళ్లయిందని దేవదాసు తాగుడుకు బానిసై జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాడు. ఇలాంటి దేవదాసులు మన మధ్య కూడా ఎక్కడో ఓ చోట తారసపడుతూనే ఉంటారు. అయితే ఈ ఫొటోలోని వ్యక్తిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అతడు లవ్‌లో ఫెయిల్‌ అయ్యాడు.. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా లవ్‌ మ్యారేజీనే చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. ఫెయిల్‌ అవుతూనే ఉన్నాడు. అది కూడా ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా 80 వేల సార్లు. అంటే 80 వేల మంది అమ్మాయిలకు ప్రపోజ్‌ చేశాడన్న మాట.

ఈ విక్రమార్కుడి పేరు నియూ జియాంగ్‌ఫెంగ్‌. వయసు 31 ఏళ్లు. చైనాలోని బీజింగ్‌లో ఉంటాడు. ప్రేమ వివాహం చేసుకోవాలని తన కోరిక.. కల కూడా. ఇందుకోసం కొత్త పంథా ఎంచుకున్నాడు. 2013లో తొలిసారి తన ప్రేమను వ్యక్తీకరించాడు ఓ అమ్మాయి ముందు. కానీ ఆమె నియూను రిజెక్ట్‌ చేసిందట. అయితే అక్కడితో ఆగిపోయి.. కుంగిపోయి.. కృశించి పోయి.. బాధపడకుండా తనకు కనిపించిన అమ్మాయికల్లా ప్రపోజ్‌ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు లవ్‌ వెబ్‌సైట్లలో, మ్యారేజి బ్యూరోల్లో కూడా తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ కూడా చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు తనకు సరైన అమ్మాయి దొరకలేదట పాపం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement