నగ్న నృత్యాలతో పార్టీ, 50 మంది అరెస్టు | 50 arrested for strip dance in pakistan | Sakshi
Sakshi News home page

నగ్న నృత్యాలతో పార్టీ, 50 మంది అరెస్టు

Jul 3 2017 5:18 PM | Updated on Sep 5 2017 3:06 PM

నగ్న నృత్యాలతో పార్టీ, 50 మంది అరెస్టు

నగ్న నృత్యాలతో పార్టీ, 50 మంది అరెస్టు

అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడారంటూ 50 మంది యువతీ యువకులను పాకిస్తాన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఇస్లామాబాద్: అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొని  పాటలు పాడారంటూ 50 మంది యువతీ యువకులను పాకిస్తాన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం పొగ తాగుతూ పెద్ద శబ్దాలతో పాటలు వింటూ యువతీ యువకులు నృత్యాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున‍్న పోలీసులు 34 మంది యువకులతోపాటు 16 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

వీరందరినీ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా అందరికీ బెయిల్‌ మంజూరైంది. ఈ ఘటనకు సంబంధించి సదరు హోటల్‌ యజమానితోపాటు నిర్వాహకుడిపైనా కేసులు నమోదు చేశారు. గత మే నెలలో లాహోర్‌లోని సొజొ వాటర్‌ పార్క్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారంటూ మత పెద్దలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement