పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జరిపిన దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో పాక్, విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు.
పాకిస్థాన్లోని ఉత్తర వాజిరిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఫైటర్ జెట్స్తో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. పాక్ వైమానిక దాడుల్లో నిత్యం ఉగ్రవాదులు హతమవుతున్నారు. గత జూన్లో పాక్ సైనిక చర్య ప్రారంభించిన తర్వాత దాదాపు 1000 మంది మరణించారు.