ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 29 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
	ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 29 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెనీ సుయెఫ్ నుంచి గీజాకు వెళ్తున్న సరుకుల రవాణా రైలు పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.
	
	కైరోకు 40 సమీపంలోని డాషుర్ పట్టణం వద్ద రైలు తొలుత ఓ మినీ బస్సును ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ ట్రక్ను ఇతర వాహనాలను ఢీ కొంది. దీంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. బాధితుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రైలు డ్రైవర్, అతని సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
