పాకిస్థాన్లోని ఖైబర్ ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఖైబర్ ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్లోని టోర్ డరా, టిరా, జటోయ్, రాజ్గల్ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
ఉగ్రవాద రహస్య స్థావరాలను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దున ఈ ప్రాంతంలో తాటిబన్, ఆల్ ఖైదా సంబంధిత సంస్థలున్నాయి. ఇరు దేశాల్లో దాడులకు పాల్పడుతుంటారు. ఉగ్రవాదులను ఏరేసేందుకు గత జూన్లో పాక్ సైనిక చర్య ప్రారంభించింది.