బస్సు బోల్తా: 14 మంది పర్యాటకుల మృతి | 14 dead in Japan ski bus accident | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: 14 మంది పర్యాటకుల మృతి

Jan 15 2016 10:31 AM | Updated on Sep 3 2017 3:44 PM

బస్సు బోల్తా: 14 మంది పర్యాటకుల మృతి

బస్సు బోల్తా: 14 మంది పర్యాటకుల మృతి

బస్సు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు మృతిచెందారు.

టోక్యో: బస్సు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... రాజధాని టోక్యో నుంచి నాగనోకు దక్షిణంగా ఉన్న ఓ రిసార్టుకు 41 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. కరిఝవా సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 27 మంది గాయపడినట్లు కేబినెట్ సెక్రటరీ యోషిహిడే సుగ మీడియాకు వివరించారు. రవాణాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ ను ఘటన స్థలానికి పంపించి సమాచారం సేకరిస్తున్నారు.

రోడ్డు మలుపు వద్ద ఓవర్ టర్న్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. అయితే, బాధితులంగా పర్యాటకులని.. టోక్యో ట్రావెల్ ఏజెన్సీ వీరికి టూర్, ట్రావెలింగ్ ప్యాకేజీ కల్పించినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా జపాన్లో ఇటువంటి ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయిని తప్పును వారిపైకి నెట్టివేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement