13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

13 year old Indian boy set software development company in Dubai - Sakshi

దుబాయ్‌: 9 ఏళ్లకే మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని దుబాయ్‌లో స్థాపించాడు. కేరళకు చెందిన ఆదిత్యన్‌ రాజేశ్‌ ఐదేళ్లకే కంప్యూటర్‌ వాడటం ప్రారంభించాడు. ఈ బుడతడు ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్‌సైట్లు, లోగో లు రూపొందిస్తున్నాడు. ఆదిత్యన్‌ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రుల తో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్‌లో ఉంటున్నాడు. తాజాగా అతను ట్రైనెట్‌ సొల్యూషన్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని అక్కడే స్థాపించాడు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్‌ సహ విద్యార్థులు, స్నేహితులే. కంపెనీకి యజమాని అవ్వాలంటే 18 ఏళ్ల కనీస వయసు ఉండాలనీ, అయితే ట్రైనెట్‌ సొల్యూషన్స్‌ కూడా కంపెనీలాగే పనిచేస్తుందనీ, ఇప్పటికే 12 మంది క్లైంట్లకు ఉచితంగా సేవలందించామని ఆదిత్యన్‌ తెలిపాడు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top