బంగారు గనిలో జరిగిన ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు
జకర్తా: బంగారు గనిలో జరిగిన ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన ఇండోనేషియా పశ్చిమ భాగంలోని జావా ప్రాంతంలో చోటుచేసుకుంది. బోగోర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదని ఓ పోలీస్ అధికారి ఉజ్వల్ ప్రాణ సిగిత్ తెలిపారు. బంగారు గనిలో తవ్వకాలు జరుపుతుండగా మట్టిపెళ్లలు కూలిపడటంతో ఊపిరాడక 12 మంది మృతిచెందారు.
అయితే, అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గత నెలలో మైనింగ్ జరుగుతున్న గనిని ప్రభుత్వం మూసివేసిన విషయం విదితమే. కానీ, కొందరు మైనర్ బాలురు ఇందులో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. మృతిచెందిన వారిలో మైనర్లు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.