సూడాన్లో తెగల మధ్య ఘర్షణ, 100 మంది మృతి | 100 killed in tribal clashes in Sudan | Sakshi
Sakshi News home page

సూడాన్లో తెగల మధ్య ఘర్షణ, 100 మంది మృతి

Nov 17 2013 8:42 AM | Updated on Sep 2 2017 12:42 AM

సూడాన్లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం వంద మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

సూడాన్లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం వంద మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. డార్పర్ రాష్ట్రంలోని ఉమ్ దొఖోన్ ప్రాంతంలో శనివారం మెస్సీరియా, సలామత్ జాతీయుల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరిగినట్టు ఆ దేశ అధికారిక రేడియో వెల్లడించింది. దాదాపు నాలుగు వేల మంది ప్రాణ భయంతో ఇళ్లు విడిచి పారిపోయారు.

అధికారులు, భద్రత దళాలు రంగంలోకి అల్లర్లను అదుపు చేశారు. ఈ సంఘటనలో కొందరు చడియన్ సైనికులు కూడా మరణించినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది. కాగా దీనిపై సూడాన్ ఆర్మీ అధికారులు స్పందించలేదు. సూడాన్లోని డార్ఫర్ రాష్ట్రంలో ఈ రెండు తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. గతేడాది భారీ ప్రాణం నష్టం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement