చంద్రబాబు...నీకు శిక్ష తప్పదు: కోటంరెడ్డి | ysrcp mla kotamreddy sridhar reddy slams chandrababu naidu government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు...నీకు శిక్ష తప్పదు: కోటంరెడ్డి

Mar 7 2016 2:40 PM | Updated on Oct 29 2018 8:29 PM

చంద్రబాబు...నీకు శిక్ష తప్పదు: కోటంరెడ్డి - Sakshi

చంద్రబాబు...నీకు శిక్ష తప్పదు: కోటంరెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్నది స్కీంల పాలన కాదని, స్కామ్ల పాలన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : రాజధాని భూ దందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. భూ దందాపై విచారణ జరిపి నిర్దోషులని తేలితే పత్రికలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇసుక దోపిడీపై అనేక కథనాలు వచ్చాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.

కేంద్రమంత్రి సుజనాచౌదరిపై కూడా కథనాలు వచ్చాయని, ఆ కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారని అని ఆయన అడిగారు. భూ దందాపై అన్ని ఆధారాలతో 'సాక్షి' బయటపెట్టిన మీరు ఇంకా ఆధారాలు కావాలంటున్నారు. ఏ ఆధారాలు కావాలని కోటంరెడ్డి అన్నారు. ఇవాళ చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవచ్చని... అయితే ఏదో ఒకరోజు చంద్రబాబుకు శిక్ష తప్పదని కోటంరెడ్డి హెచ్చరించారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది స్కీంల పాలన కాదని, స్కామ్ల పాలన అని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని, జోన్ త్రీలో ఉన్నది మీరు, మీ మంత్రులేనని కోటంరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని, ఇప్పుడు టీడీపీ సర్కార్ రాజధాని పేరుతో రైతుల కడుపు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement