'ఇప్పటికైనా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి' | ysrcp leader dharmana fires on ap cm chandrababu over special status | Sakshi
Sakshi News home page

'ఇప్పటికైనా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి'

May 5 2016 2:03 PM | Updated on Mar 23 2019 9:10 PM

'ఇప్పటికైనా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి' - Sakshi

'ఇప్పటికైనా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం వైఖరి స్పష్టమైందన్నారు.

అందరం కలిసి పోరాడుదాం...ప్రత్యేక హోదా సాధించుకుందామని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోరాటం చేసినా తాము మద్దతిస్తామని చెప్పారు.  ఈ నెల 10న ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు. చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పడం మాని...తెగించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాన సూచించారు. ఈ నెల 10న ఏపీకు ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement