
5న పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
వచ్చే నెల 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు.
ఏలూరు: వచ్చే నెల 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. విలీన మండలమైన కుక్కునూరులో వైఎస్ జగన్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. గిరిజనులతో భేటీ అవుతారని, పోలవరం ప్యాకేజీ, నిర్వాసితుల సమస్యపై జగన్ చర్చిస్తారని చెప్పారు.
వచ్చే 2న పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కరువు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనలు ఉంటాయని చెప్పారు. ఏలూరు వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు.