దాసరి మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | ys jagan mohan reddy condoles dasari narayana rao's death | Sakshi
Sakshi News home page

ఆయన ఒక యుగకర్త: వైఎస్‌ జగన్‌

May 30 2017 8:24 PM | Updated on Jul 25 2018 4:42 PM

ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు.



హైదరాబాద్‌ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని, అన్నారు. దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా ఉన్నారని, సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త అని పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పత్రికాధిపతిగా, మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ చిరస్మరణీయులని వైఎస్‌ జగన్‌ అన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని, కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement