ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు | YS Jagan greets Muslims on the beginning of holy Ramzan month | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

May 27 2017 9:33 PM | Updated on Oct 16 2018 6:01 PM

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు - Sakshi

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు, సోదరీమణులకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఐకమత్యాన్ని, సామరస్యతను రంజాన్ మాసం పెంపొందిస్తుందని అన్నారు.

ఈ పవిత్ర దినాల్లో ముస్లిం సమాజమంతా సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని, అల్లా వారికి సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సాటి వారికి చేయూత అందించాలనే రంజాన్ సారాంశం మరింతగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, మనోనిశ్చలత, దాణ గుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement